హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు భద్రారెడ్డి కూడా వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని భద్రారెడ్డి కేటీఆర్‌కు తెలిపినట్లు సమాచారం. మరో వైపు గురువారం సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి కేటీఆర్‌కు వివరణ ఇచ్చారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Related Posts

ఆప్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ.
- JBN
- 8 March 2024
- 3958

ఏపీలో పొత్తులపై కొలిక్కిరాని చర్చలు
- JBN
- 8 March 2024
- 109

నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
- JBN
- 8 March 2024
- 3