
దేశవ్యాప్తంగా SIR ప్రకంపనలు అగ్గి రాజేస్తున్నాయి. ఓట్ల తొలగింపుతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. సీఈసీ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా అంశాన్ని తెరపైకి తెస్తోంది. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. అక్టోబర్ 10 నుంచి అదే తరహా ఉద్యమానికి సీజేపీ సమాయత్తం అవుతోంది. అయితే అనేక ఆంక్షలు, అడ్డంకులు సృష్టించడంపై విపక్షనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
